సమాజం లో అన్ని రకాల వాళ్ళు వుంటారు కొందరే మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తారు అందులో మనం కూడా భాగస్వామ్యం కావాలి అని మా చిన్న ప్రయత్నం

లక్ష్యాలు

ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకు మిత్రమా చెయ్యి చెయ్యి కలుపుదాం నవ సమాజం స్థాపిద్దాం

మరో క్విట్ ఇండియా ఉద్యమ రూపకల్పన

మద్యపానం మరియు ధూమపానం వలన అవి సేవించే వారికే కాకుండా ఇతరులకు కూడా కలిగే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించి, మన దేశం నుండి మద్యపానాన్ని సంపూర్ణంగా పారద్రోలడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమాన్ని(క్విట్ ఆల్కహాల్ ఫ్రమ్ ఇండియా) ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయుట.

మన ఇల్లు

మా ప్రయత్నం టీమ్ అనాధ శరణాలయం మరియు వృధ్ధాశ్రమాలును సొంతంగా ఏర్పాటు చేసి అనాధలకు మరియు వృధ్ధులకు ఆశ్రమం కల్పించి వారికి చేయూతనిచ్చుట.

సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం సామాన్యునికి వరం లాంటిది అయితే ప్రభుత్వంలో పనిచేసే కొంత మంది పనిదొంగలకు శాపం లాంటిది. మనం కట్టే పన్నులనుండి వచ్చే ఆదాయం తో జీతాలు తీసుకుంటూ మనల్నే చిన్నచూపు చూసే కొంతమంది ప్రభుత్వ అవినీతి అధికారులకు సమాచార హక్కు చట్టం కొరడా లాంటిది. కావున ఆ కొరడా ఎలా వాడాలో ప్రజల్లో అవగాహన కల్పించుటకు సదస్సులను ఏర్పాటు చేసి విజయవంతం చేయుట.

విద్యార్థి-క్రీడలు

మా ఈ ప్రయత్నం ద్వారా అన్ని స్థాయిలలో అనగా గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయస్థాయి వరకు ప్రతిభ వుండి వెనుకబడిన క్రీడాకారులకు చేయూత అందించుట.

మరో ప్రపంచం .. మరో ప్రపంచం .. మరో ప్రపంచం పిలిచింది.. పదండి ముందుకు.. పదండి తోసుకు.. పోదాం పోదాం..పై పైకి (శ్రీ శ్రీ)

మా గురించి

మా ఈ ప్రయత్నానికి చేయూతని అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

స్వాతంత్య్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలు దాటుతున్నా భారతీయుల తలరాత మాత్రం మారడం లేదు. ఎన్నో సమస్యలు ఇంకా మనల్ని వెంటాడుతూనే వున్నాయి. ఈ సమస్యలు తీరాలన్న భారతదేశం అభివృద్ధి సాధించాలన్నా అది మన చేతుల్లోనే వుంది. సామాన్యుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి ప్రభుత్వం తన పని తీరు మార్చుకోగలగాలి, ఏ సమస్య తీరాలన్న ఎక్కడో ఒక చోట పోరాటం మొదలవ్వాలి, ఈనాడు మన అందరిని ఎక్కువగా ప్రభావితం చేసే సమస్యల్లో పేదరికం, కులం, మద్యపానం, ధూమపానం, అవినీతి మరియు రౌడీయిజం ప్రధాన సమస్యలు కాగా ఇవి కాక ఇంకా ఎన్నో సమస్యలు నిత్యం మనం చూస్తూనే వున్నాం. ఈ సమస్యలన్నీ ఇప్పటికిప్పుడు పరిష్కారం కావాలంటే అసాధ్యం కానీ ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. ఇలాంటి సమస్యలపై ప్రజలలో ఒక అవగాహన కల్పించి వారిని చైతన్య పరచి వారికి మా ద్వారా వీలైనంత సహాయం అందించడమే మా ఈ ప్రయత్నం లక్ష్యం.

  • 85(లక్ష్యం 100000 మించి)

  • 225(లక్ష్యం 100000 మించి)

  • కార్యకర్తల సహాయం

DO

Client

నీ మొదటి విజయం సాధించిన తరువాత అలక్ష్యం ప్రదర్శించవద్దు గుర్తుంచుకో .. రెండవ ప్రయత్నంలో ఓడిపోతే నీ గెలుపు గాలివాటం గా వచ్చిందని చెప్పటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు..!! (A P J అబ్దుల్ కలామ్)

నా ఓటు నా హక్కు

నా ఓటు నా హక్కు

Get in touch