ఇప్పుడున్న ప్రభుత్వ సంస్థల్లో అవినీతి అధికారులు ఎక్కువై పోయారు, వినుకొండ మండల రెవిన్యూ కార్యాలయంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన అవినీతి కారణంగా గత 8 సంవత్సరాల నుండి మేము కోర్టుల చుట్టూ తిరుగుతూనే వున్నాం ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని , జాయింట్ కలెక్టర్ గారిని, రెవిన్యూ డివిజినల్ అధికారులను , మండల రెవిన్యూ అధికారులను ఎన్ని సార్లు కలిసిన న్యాయం జరుగలేదు ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, మా సర్వే నెంబర్ మార్చారు , వాస్తవంగా మా సర్వే నెంబర్ 834 కానీ అడంగల్ నుండి 1B నుండి మా పేర్లను తీసివేసి మాకు సంబంధం లేని సర్వే నెంబర్ 239 లో మా పొలం ఎంట్రీలను వేశారు అన్ని రకాల డాక్యూమెంట్స్ MRO నుండి కలెక్టర్గారి వరకు అందరికి చూపించి న్యాయం చేయమని కోరినప్పటికీ మాకు న్యాయం ఇప్పటివరకు జరుగలేదు, పైగా మా భూమిని కబ్జా చేసినవారు రాజకీయ అండతో , అనేక బెదిరింపులతో మమ్ములను ఇబ్బంది పెట్టడమే కాక మా న్యాయవాదులను కూడా ప్రభావితం చేస్తూ కేసు ఎటూ తేలకుండా 8 సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

అందుకే మాలాగా ఎవరూ ఇబ్బందులకు గురి కాకూడదని ప్రజలలో అవగాహనా కల్పించడానికి నిత్యం మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం

ప్రయత్నం వ్యవస్థాపకులు

కడియాల నాగేశ్వరరావు