March 5, 2017

లక్ష్యాలు

మరో క్విట్ ఇండియా ఉద్యమ రూపకల్పన

మద్యపానం మరియు ధూమపానం వలన అవి సేవించే వారికే కాకుండా ఇతరులకు కూడా కలిగే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించి, మన దేశం నుండి మద్యపానాన్ని సంపూర్ణంగా పారద్రోలడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమాన్ని(క్విట్ ఆల్కహాల్ ఫ్రొం ఇండియా)  ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయుట.

సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం సామాన్యునికి వరం లాంటిది అయితే ప్రభుత్వంలో పనిచేసే కొంత మంది పనిదొంగలకు శాపం లాంటిది. మనం కట్టే పన్నులనుండి వచ్చే ఆదాయం తో జీతాలు తీసుకుంటూ మనల్నే చిన్నచూపు చూసే కొంతమంది ప్రభుత్వ అవినీతి అధికారులకు  సమాచార హక్కు చట్టం కొరడా లాంటిది. కావున ఆ కొరడా ఎలా వాడాలో ప్రజల్లో అవగాహన కల్పించుటకు సదస్సులను ఏర్పాటు చేసి విజయవంతం చేయుట.

పేదలకు అనాదలకు చదువు ఆరోగ్యం

చదువుకునే రోజులనుండి మనం బాగా అధివృద్ధి చెంది చదువుకొనే రోజులకు వచ్చేశాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్చాలంటే భయపడే పరిస్థితి నెలకొంది, మధ్య తరగతి వారికి స్థోమత లేకపోయినా తప్పనిసరి పరిస్థితులలో పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ఇక దిగువ తరగతి వారి పిల్లలకు చదువు మన ప్రభుత్వం ఎంత చక్కగా అందిస్తుందో అందరికి తెలిసిన విషయమే. ఇలా ఇంకా ఎన్నో సమస్యలను విద్యార్థులు పాఠశాలలలో కళాశాలలో ఎదుర్కొంటున్నారు. అందుకోసం మా వంతుగా మేము కొంత మంది విద్యర్థులనైనా స్కాలర్షిప్ల రూపంలో మా ఈ ప్రయత్నం సంస్ధ ద్వారా ఆదుకొంటూ సిస్టమ్ లో మార్పుల కోసం పోరాడుట.

ఇక వైద్యం గురించి చెప్పాల్సిన పని లేదు, ప్రభుత్వ వైద్యశాలల్లో వసతుల కరువు ప్రయివేట్ వైద్యశాలల్లో డబ్బులకు కరువు, దిగువ మధ్యతరగతి వారికి కూడా మెరుగైన వైద్యం ప్రద్బుత్వం అందించేలా చేయాలంటే ఏం చేయాలో పెద్దలను మరియూ మేధావులను కలిసి వారి ఆలోచనలను మరియు మా ఆలోచనలను కలిపి పరిగణనలోకి తీసుకొని వారికి మెరుగైన వైద్యం అందిచుట.

ప్రభుత్వం వారితో మాట్లాడి లేదా ఎవరైనా దాతలతో కలసి ప్రయత్నం వారి “మన ఇల్లు” అనాధ శరణాలయాలను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేయుట.

విద్యార్థి-క్రీడలు

వంద కోట్ల జనాభా దాటిన మన భారతదేశం క్రీడలలో ఎంత ప్రావీణ్యం సంపాదించిందో అందరికి తెలిసిందే, మన దేశంలో వున్న క్రీడా రాజకీయాలు మరేదేశంలో లేవంటే అతిశయోక్తి కాదు, ఈ రాజకీయాల వలన అనేకమంది ప్రతిభావంతులు ప్రారంభ దశలోనే క్రీడలపై అనాసక్తి చూపడం వలన అంతర్జాతీయ క్రీడల పట్టికలో మనం చివరి స్థానాల్లో కొనసాగుతున్నాం. ఇదంతా కూడా రాజకీయం మరియు డబ్బుతో ముడిపడి ఉండుట కూడా ఒక కారణం అయితే అసలైన క్రీడా ప్రోత్సాహం తొలిదశ లో క్రీడాకారులకు లభించకపోవడం కూడా ఒక కారణం, కావున మా ఈ ప్రయత్నం ద్వారా అన్ని స్థాయిలలో అనగా గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయస్థాయి వరకు ప్రతిభ వుండి వెనుకబడిన  క్రీడాకారులకు చేయూత అందించుట.